¡Sorpréndeme!

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP Desam

2025-04-07 1 Dailymotion

 ముంబై ఇండియన్స్ టీమ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం. ప్రధానంగా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అయిన దగ్గర నుంచి టీమ్ లో అంతర్గత విబేధాలు తలెత్తూనే ఉంటున్నాయి. పైగా జట్టు ప్రదర్శన అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ మూడింటిలో ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ మీద గెలిచే అవకాశాలున్నా చెత్త నిర్ణయాలతో మ్యాచ్ ను కోల్పోయింది ముంబై. ఇప్పుడు కొత్తగా తిలక్ వర్మ కు జరిగిన అవమానం జట్టులో కుదుపులకు కారణమవుతోంది. హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ సంతృప్తితో లేరట. 22 ఏళ్ల వయస్సులో హార్డ్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్న తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేసి మరీ మిచెల్ శాంట్నర్ ను పాండ్యా బరిలోకి దింపటం వివాదాస్పదమైంది కదా. ఇప్పుడు దాని కాన్ స్వీక్వెనెన్స్ ఏంటంటే తిలక్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి ముంబై ఇండియన్స్ అనే పేరును తొలగించాడు. ఇంతకు ముందు ఇండియా, ముంబై ఇండియన్స్ ఉండేది కానీ ఇప్పుడు స్పోర్ట్ పర్సన్ అని మాత్రమే బయో రాసి ఉంది. అయితే ఇది కేవలం నార్మల్ గా తీసేశాడా లేదా ఈ సీజన్ తర్వాత టీమ్ మారిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి తిలక్ కు ఈ రేంజ్ లో పాపులారిటీ రావటానికి వేదిక కల్పించింది ముంబై ఇండియన్స్ జట్టే. కానీ హార్దిక్ తీరు నచ్చకమాత్రమే తిలక్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆర్సీబీ తో మ్యాచ్ లో మరి తనపై పాండ్యా చేసిన విమర్శలకు తిలక్ బ్యాట్ తోనే సమాధాననం చెబుతాడేమో చూడాలి. మొత్తంగా లాస్ట్ ఇయర్ రోహిత్ ను తప్పించి పాండ్యాను కెప్టెన్ చేసిన విధానం ముంబైని కుదిపిస్తే ఇప్ప్పుడు తిలక్ వర్మ ఇష్యూ MI ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.